హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాతృత్వం చాటుకున్న చిలువేరు సమ్మయ్య గౌడ్

MHBD: కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో అనారోగ్య కారణాలతో తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి కుటుంబ దినస్థితిని చూసి చలించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇంటిపై తాటిపత్రి కప్పించి దాతృత్వం చాటుకున్నారు.