హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్‌కు వినతి

JGL: కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆదివారం మహిళలు వినతి పత్రం అందించారు. గ్రామంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి మహిళలు వేములవాడలో ప్రభుత్వ విప్ను కలిశారు. అంబారిపేట గ్రామం నుంచి తుర్తి గ్రామం వరకు తారు రోడ్డును మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.