హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆటపాటలతో సందడి చేసిన మహిళా మణులు

BDK: కరకగూడెం మండల కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.