హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు వైభవంగా లక్ష కుంకుమార్చన

ASR: అరకు రైల్వే స్టేషన్‌ రైల్వే కాలనీలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం అమ్మవారు మహాగౌరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి నామస్మరణలతో కాలనీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.