SDPT: సిద్దిపేట నుంచి కరీంనగర్కు వెళ్తున్న ఆటోను బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ కెనాల్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఆటోను ఢీకొన్న కారు.. పలువురికి గాయాలు


