హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా సద్దుల బతుకమ్మ ఆటలు

SDPT: బెజ్జంకిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ‘చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల బొమ్మ’ అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ ఆటలాడారు. ప్రత్యేక మైదానంలో బతుకమ్మలను పేర్చి చిన్నాపెద్దా కలిసి సంబరాలు జరుపుకున్నారు. మహిళల సందడితో ఆలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకొంది.