హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 23న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

KNR: రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. శంకరపట్నంలో మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంట్ కోతలు, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.