RR: ఫరూఖ్నగర్ మండలం వెల్జర్ల గ్రామంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం సర్పంచ్ ఆర్. బాబు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదలను పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదగాలని యువతకు సూచించారు.
తెలంగాణ
వెల్జర్లలో క్రికెట్ టోర్నీ ప్రారంభం


