హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశేషంగా ఆకట్టుకున్న పెద్ద బతుకమ్మ

హనంకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో ఆదివారం రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆడపడుచులందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి గునుగు తంగేడు బంతి చామంతి పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలిచి సద్దుల బతుకమ్మ వేడుకలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో తలపై మోసుకెళ్తున్న ఓ పెద్ద బతుకమ్మ చూపులను విశేషంగా ఆకట్టుకుంది.