హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారదర్శకంగా ZPTC, MPTC ఎన్నికలు: కలెక్టర్

సత్యసాయి జిల్లాలో ZPTC, MPTC ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకులు అరుణ్ బాబు, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తిలో నిర్వహించిన సమీక్షలో కోడ్ అమలు, పటిష్ట పోలీసు బందోబస్తు, సిబ్బందికి శిక్షణపై చర్చించారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.