BDK: ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు గ్రామంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: మర్కోడులో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు


