ASR: అరకు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని టీడీపీ ఇన్చార్జి డా. సియ్యారి దొన్నుదొర ఆదివారం తెలిపారు. కూటమి సమన్వయ కమిటీ అధికారిక ప్రకటన చేసే వరకు ఎవరూ తమకు తామే అభ్యర్థులమంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు పెట్టవద్దని కోరారు. తొందరపాటు ప్రచారంతో కూటమి ధర్మానికి విఘాతం కలిగించవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యర్థుల ప్రకటన వచ్చేవరకు ఆగండి'


