హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోవెలకుంట్లలో అగ్ని ప్రమాదం

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పైపుల గోడౌన్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా పొగలు అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.