హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గాదేవిగా రెడ్డెమ్మ తల్లి దర్శనం

అన్నమయ్య: గుర్రంకొండ మండలం చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ ఆలయంలో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. ఉభయదారులుగా రాజన్న నాయుడు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. తొమ్మిదో రోజు మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ చైర్మన్ రాజన్న నాయుడు, ఈఓ మంజుల తెలిపారు.