MDCL: అల్వాల్లో స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.7.35 లక్షలు మోసం చేశారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి శ్రీరామచంద్ర మూర్తి (42) నుంచి రూ.7,80,496 వసూలు చేశారు. ఇందులో రూ.34,734.76 మాత్రమే తిరిగి చెల్లించడంతో రూ.7,35,760 నష్టపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
స్టాక్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం


