హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ముమ్మిడివరంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం'

కోనసీమ: ముమ్మిడివరంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని జిల్లా అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తె తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల కేంద్రానికి వంద మీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించలేదన్నారు. నిర్దేశిత సమయానికి వచ్చిన వారికే నామినేషన్ వేసే అవకాశం కల్పించామన్నారు.