VZM: గజపతినగరం మండలంలోని కెంగువ మాజీ సర్పంచ్ మజ్జి రామునాయుడు, మజ్జి లక్ష్మీ దంపతులు ఆదివారం రాత్రి వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పనరసయ్య సమక్షంలో 150 కుటుంబాలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి అప్పల నరసయ్య కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన కెంగువ మాజీ సర్పంచ్


