హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించాలి'

కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా సాధారణ పరిశీలకులు చక్రధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.