ASF: బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లి గ్రామ శివారులో కోడిపందేల స్థావరంపై SI రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. కత్తులు కట్టి పందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.300 నగదు, మూడు కోళ్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు, జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.
తెలంగాణ
కోడిపందేల స్థావరంపై దాడి..ముగ్గురి అరెస్ట్


