శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ, ఇచ్చాపురం మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు చివరి రోజున తమ నామినేషన్లను అధికారులకు అందజేసేందుకు భారీగా తరలివచ్చారు. చైర్పర్సన్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉత్సాహంగా నామినేషన్ల వేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం


