ELR: బుట్టాయగూడెం మండలం అచ్చయ్యపాలెం గ్రామ శివారులో డబ్బులు పణంగా పెట్టి కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిని ఎస్సై పి. చెన్నారావు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6,200 నగదు, ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్


