హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం పడితే పాఠశాల చుట్టూ నీరు

TPT: పిచ్చాటూరు మండలం వెంగళత్తూరులోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే పాఠశాల చుట్టూ నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. రహదారి పక్కన ఉన్న పాఠశాలకు ప్రహరీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కోరుతున్నారు.