BHPL: జిల్లా అంతటా బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. ఆడపడుచులంతా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ అంటూ గొంతెత్తి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. పల్లెపల్లెనా పూల పండుగ కళ ఉట్టిపడగా, ఎటుచూసినా ఆడబిడ్డల ఆటపాటలతో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ


