VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం సింహవల్లి తాయారు అమ్మవారి బేడా తిరువీధి మహోత్సవం వైభవంగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ బేడామండపంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాటాల నడుమ తిరువీధిసేవ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో బేడా తిరువీధి మహోత్సవం


