WGL: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశీవిశ్వేశ్వర ఆలయం, తోట మైదానం, సీకేఎం కళాశాల మైదానం, కాశీబుగ్గ శివాలయం, రంగనాయక మైదానాల్లో మహిళలు బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, శిఖర భాగంలో గౌరమ్మను కొలువుదీర్చి పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: జిల్లా వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు


