KNR: జిల్లా అలుగునూరులోని వీజేఆర్ క్రికెట్ గ్రౌండ్ అండ్ అకాడమీలో హెచ్సీఏ ఆధ్వర్యంలో, కేడీసీఏ సహకారంతో నిర్వహించిన తొమ్మిది రోజుల మహిళల క్రికెట్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది క్రీడాకారిణులు శిక్షణ పొందారు. ముగింపు వేడుకల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
తెలంగాణ
ముగిసిన మహిళల క్రికెట్ శిక్షణ శిబిరం


