హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

SDPT: మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో బతుకమ్మ పండుగ సందర్భంగా పట్టణంలోని 8,9,10 వార్డుల్లో అందంగా బతుకమ్మలను పేర్చిన ఐదుగురు మహిళలకు పట్టుచీరలు మరో 50 మంది మహిళలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.