హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో 2 చోట్ల సీపీఎం అభ్యర్థుల నామినేషన్

WG: నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 24వ వార్డు అభ్యర్థిగా ఎనిగేటి రమణ, 23వ వార్డు అభ్యర్థిగా బూడిద భువనేశ్వరి ఆదివారం భారీ ర్యాలీగా తరలివచ్చి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు.