MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్లో కార్పొరేటర్ ఆంజనేయులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఏదిర–దివిటిపల్లి మధ్య రెండు కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే పనులు ప్రారంభించారు. మొక్కల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సౌకర్యార్థం ఈ చర్యలు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు.
తెలంగాణ
పారిశుద్ధ్య చర్యలకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్


