ATP: గుత్తిలో నామినేషన్ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, దాంతో ఎస్సై కాళ్లు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి రంగాస్వామి పట్టుకున్నారనే వార్త అసత్యమని అనంతపురం పోలీసులు స్పష్టం చేశారు. అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఎస్సై సురేష్ సహకరించి నామినేషన్ దాఖలు చేయించారని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సై కాళ్లు పట్టుకున్నారనే వార్త అసత్యం: పోలీసులు


