హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమ్మతోర్లాడలో కొండచిలువ కలకలం

SKLM: ఆమదాలవలస మండలంలోని నిమ్మతోర్లాడ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎనిమిది అడుగుల కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో గ్రామస్తులు ఆ కొండ చిలువను చంపివేశారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఆందోళన నెలకొంది.