హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: సింగరాయకొండ వ్యక్తి కుప్పంలో రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ నెల 17న గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9.15 గంటలకు మృతి చెందాడు. మృతుడు తనది సింగరాయకొండ బాలాజీనగర్ అని తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.