హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాపరాయి జలపాతం వద్ద సందడి

ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. దసరా సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. సాయంత్రం వరకు పర్యాటకుల రాక కొనసాగింది. మరోవైపు బొంగులో చికెన్‌, కబాబ్‌ల విక్రయాలు జోరుగా సాగాయని వ్యాపారులు తెలిపారు.