హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదిలాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సాంస్కృతిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.