హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు గ్రామానికి చెందిన చొప్ప నారాయణరెడ్డి పొలం పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి మృతి చెందారు. పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణరెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.