ASR: అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలోని కొత్తపాలెం జలపాతానికి ఆదివారం సందర్శకులు పోటెత్తారు. దసరా సెలవులు, ఆదివారం కావడంతో ప్రకృతి ప్రేమికులు కుటుంబ సభ్యులతో కలిసి జలపాతాన్ని సందర్శించారు. ప్రధాన రహదారికి సమీపంలోనే జలపాతం ఉండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
ఆంధ్రప్రదేశ్
జలపాతంలో సందర్శకుల తాకిడి


