NGKL: తెల్కపల్లి మండల అధ్యక్షుడు బండ పర్వతాల కుమారుడు ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితుడికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచిస్తూ, బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే


