హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణ సంస్కృతికి అమెరికా కోడలి జై

WGL: వర్ధన్నపేట పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వర్ధన్నపేట కోడలైన అమెరికా మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చీరకట్టులో సంప్రదాయబద్ధంగా ముస్తాబై స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు. విదేశాల్లో పెరిగినా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ఆమె చూపిన మక్కువను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.