MDK: తూప్రాన్ పట్టణంలో ఓ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో మహా కరుణ యాత్ర పేరుతో శాఖాహార ర్యాలీ నిర్వహించారు. మానవులు శాఖాహారాన్ని ఆహారంగా తీసుకోవాలని నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ కొనసాగించారు. శాఖాహారం ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణ
VIDEO: 'శాఖాహారమే మానవుల ఆహారం'


