హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలమైన అభ్యర్థికే బీ-ఫారం ఇవ్వాలి

VSP: గాజువాక 104వ వార్డులో జనసేన పార్టీ బీ-ఫారం బలమైన అభ్యర్థికే ఇవ్వాలని సుమారు 200 మంది పార్టీ సభ్యులు అధిష్ఠానాన్ని కోరారు. ప్రజల్లో గుర్తింపు, కార్యకర్తల మద్దతు ఉన్నవారికే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ నిర్దేశించిన 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.