హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 19న దసరా ఉత్సవాలు: ఎమ్మెల్యే

PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ఈ నెల 19న సాయంత్రం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, సినీ, జబర్దస్త్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయని తెలిపారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనాలన్నారు.