హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబరాన్నంటిన సంబరాలు

SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంతో పాటు పరిసర పల్లెల్లో అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చిన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు.