హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి'

KMR: ఇందిరాగాంధీ స్టేడియంలో షబ్బీర్ ఫౌండేషన్, దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైెర్ పర్సన్ ఉమారాణి ఈరోజు కోరారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో పండుగ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దసరా పండుగను ప్రజలందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు.