కోనసీమ: రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థి మేడిశెట్టి శేషారావు ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ నేతృత్వంలో భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి అంకితమవుతానని శేషారావు పేర్కొన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురం కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా శేషారావు నామినేషన్


