BPT: చీరాల వాడరేవు, రామపురం సముద్రతీరాలు దసరా సెలవుల నేపథ్యంలో ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. వరుసగా సెలవులు రావడంతో దూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు తరలివచ్చి, సముద్రపు అలలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా మెరైన్ పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో తీర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
దసరా సెలవులతో కిటకిటలాడిన ఓడరేవు


