E.G: సీతానగరం మండలానికి సంబంధించిన వైసీపీ అనుబంధ విభాగాల కొత్త కమిటీలను మాజీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా ప్రకటించారు. మండల వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా గూడెపు శ్రీనివాసరావు, టీచర్స్ విభాగ అధ్యక్షుడిగా రాయుడు వినయ్ కుమార్, గ్రీవెన్స్ విభాగ అధ్యక్షుడిగా కర్రీ చంద్రశేఖర్లను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికైన అధ్యక్షులకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీతానగరం మండల వైసీపీ అనుబంధ విభాగాల నియామకం


