హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ బరిలో రెబల్ అభ్యర్థిగా నాగరాజు

ఏలూరు మేయర్ పదవికి తాను రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని TDP నేత రెడ్డి నాగరాజు మీడియాతో తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం సీట్ల సర్దుబాటు జరగలేదని పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే స్నేహపూర్వక పోటీకి సిద్ధమన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు పూర్తిగా కట్టుబడి ఉంటానని, వారి మార్గదర్శకాల మేరకే తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.