హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ నామినేషన్ల ప్రక్రియ పరిశీలన

KRNL: వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇవాళ జరుగుతున్న మేయర్ నామినేషన్ల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. KMC కమిషనర్ ఓబులేసుతో కలిసి ప్రక్రియను సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ తీరుపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించారు.