W.G: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని ఆకివీడు సీఐ కాళీ చరణ్ స్పష్టం చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ పాటించాల్సిందే: సీఐ


