హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్లకు పటిష్ట భద్రత కల్పించాలి'

కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. అభ్యర్థులు భయాందోళనలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పులివెందుల, రాజంపేటలో ఉద్రిక్తతలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.